అరవ్కి పెళ్లంటే రెండు మనసులను జీవితాంతం కలిపే అద్భుతమైన బంధం. కానీ నిత్యకి మాత్రం పెళ్లంటే స్వేచ్ఛను కోల్పోయే బంధం—ఆమె చూసిన చేదు అనుభవాలే అందుకు కారణం. ఇతరుల పెళ్లిళ్లను అందంగా మలిచే వెడ్డింగ్ ప్లానర్ అరవ్, పెళ్లిళ్లు విఫలమైనప్పుడు విడాకుల కోసం పోరాడే డైవోర్స్ లాయర్ నిత్య... పూర్తిగా భిన్నమైన ఆలోచనలున్న వీరిద్దరూ అనుకోకుండా ఒకరి జీవితంలోకి మరొకరు వస్తారు. ఇతరుల ప్రేమకథలకు పరిష్కారాలు చూపిస్తూ, తమ మధ్య పుట్టిన ప్రేమను మాత్రం గుర్తించలేకపోతారు. వీరిద్దరి మధ్య ప్రేమ గెలుస్తుందా?















