వందేళ్ల క్రితమే భారత దేశంలోని సాంఘీక, ఆర్థిక, ఆధ్యాత్మిక అసమానతలను చూపించిన పుస్తకమే ‘మాలపల్లి’. సంగ దాసు గాంధీ సిద్దాంతాలకు ప్రతీక, వెంకట దాసు భగత్ సింగ్ ఆలోచనలకు ప్రతీక. ఉన్నవ లక్ష్మినారాయణ నాటి సమాజంలో సాంఘిక, ఆర్థిక అసమానతలను తొలగించాలని.. సమసమాజాన్ని స్థాపించాలనేయ్ లక్ష్యంతో పనిచేశారు. కుల వ్యవస్థని నిరసిస్తూ.. అగ్రవర్ణాలు, హరిజనులు కలిసి మెలసి ఉండాలని భావించారు.






